తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మారేడుమిల్లి మండలం పాముల మామిడి గ్రామానికి చెందిన సాధన సుబ్బారెడ్డి అనే గిరిజనుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కుంటుంబసభ్యులు అతనిని ఆటోలో బోధులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆటోలో రంపచోడవరం వెళ్తుండగా.. భూపతిపాలెం జలాశయం వద్ద కాకినాడ నుంచి భద్రాచలం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కారు ఆటో ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు - రంపచోడవరంఆ కారు ఆటో ఢీ వార్తలు
విద్యుదాఘాతానికి గురైన వ్యక్తిని ఆటోలో తీసుకెళ్తుండగా.. కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

కారు ఆటో ఢీ.. నలుగురుకి తీవ్ర గాయాలు