తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం కందుల పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అమలాపురం నుంచి బండారులంక వైపు వస్తున్న ద్విచక్ర వాహన చోదకుడు కందులపాడు వద్ద రోడ్డు పక్కన ఉన్న యువకుడిని బలంగా ఢీ కొట్టి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వారిని చికిత్స నిమిత్తం అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు.
అమలాపురంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు - east godavari district accident news
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు రోడ్డు పక్కన నిలబడి ఉన్న యువకుడిని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమలాపురం ఆస్పత్రికి తరలించారు.
అమలాపురంలో రోడ్డు ప్రమాదం