తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం వద్ద రాష్ట్ర రహదారిపై స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులు కృష్ణాజిల్లా కైకలూరు మండలం సీతనపల్లి గ్రామానికి చెందిన సీమోను (45) సూర్యారావు (60)గా గుర్తించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం... ఇద్దరు మృతి - east godavari district updates
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మృతులు కృష్ణా జిల్లావాసులుగా గుర్తించారు.
![స్కూటీని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం... ఇద్దరు మృతి road accident at chakalipalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10898359-981-10898359-1615036897770.jpg)
గుర్తుతెలియని వాహనం స్కూటీ ఢీ... ఇద్దరు మృతి