రంపచోడవరంలో అనిశాకు చిక్కిన ఆర్ఐ.. - ఏసీబీ అధికారులకు చిక్కిన ఆర్ఐ
13:08 September 28
Rjy_ACB Caught RI_Breaking
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం తహాసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ వీర బ్రహ్మం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రంపచోడవరం మండలం సిరిగిందలపాడు గ్రామానికి చెందిన గూడెం రాంబాబు అనే గిరిజనుడు తన అత్తగారైన కాంతం పేరుమీద ఉన్న ఎకరం భూమిని తన భార్య రమణ పేరున మార్పు చేయాలని ఏడాది క్రితం రంపచోడవరం తహాసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రూ.10,000 లంచం ఇస్తేనే పట్టా ఇస్తానని రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెప్పారని రాంబాబు తెలిపాడు. తాను అంత ఇచ్చుకోలేనని రూ.5000 ఇస్తానని చెప్పి.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. అనంతరం రాంబాబు ఆర్ఐకి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఇదీ చదవండీ..Sajjala: 'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బంది'