రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల కోసం అవసరమైన భూములను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పరిశీలించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా రాజానగరం మండలం రాదేయపాలెంలో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను పరిశీలించారు.
ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం భూముల పరిశీలన - తూర్పు గోదావరి తాజా వార్తలు
ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం అవసరమైన భూములను... రెవెన్యూ డివిజనల్ మెజిస్ట్రేట్, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పరిశీలించారు. అలాగే అర్హుల జాబితాను స్థానిక మండల తహసీల్దార్ వివరించారు.
ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం భూముల పరిశీలన
అలాగే అర్హుల జాబితాను స్థానిక మండల తహసీల్దార్ సబ్ కలెక్టర్కు వివరించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు రాజమండ్రి పరిధిలోని ధవళేశ్వరం గ్రామంలో నిర్దేశించిన రైతు బజార్ స్థలాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...గిరిపుత్రుల సంకల్పం...గ్రామాలకు రహదారులు