ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల వద్దకు చేర్చాలన్నదే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే వారి ముఖ్య విధి అని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. వాలంటీర్ ద్వారా అన్యాయం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి రెండు రోజుల్లోనే బాధ్యులను తొలగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో విశ్రాంత సీనియర్ సర్వేయర్, విశ్రాంత రెవెన్యూ అధికారితో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుందని వెల్లడించారు.
భూసమస్యలపై విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ..! - pilli subash chandra boss
రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించేందుకే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.
ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్