ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAINS: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు.. నిండుకుండలా మారుతున్న జలాశయాలు - rain latest updates

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత మూడురోజులుగా పడుతున్న వానలతో తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జలాశయాలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

కుండపోత వర్షాలతో నిండుకుండలా జలాశయాలు
కుండపోత వర్షాలతో నిండుకుండలా జలాశయాలు

By

Published : Jul 13, 2021, 10:23 AM IST

Updated : Jul 13, 2021, 11:48 AM IST

కుండపోత వర్షాలతో నిండుకుండలా జలాశయాలు

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ , సూరంపాలెం జలాశయాలలోకి నీరు వచ్చి చేరింది. ఫలితంగా... జలాశయాలు నిండుకుండలా మారాయి.

204 మీటర్ల సామర్ధ్యం కలిగిన భూపతిపాలెం జలాశయంలోకి 200 మీటర్ల నీరు వచ్చి చేరడంతో మంగళవారం ఉదయం 200 క్యూసెక్కుల నీటిని దిగువున ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. అలాగే వర్షంతో కొండ వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో కొన్ని గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి.

Last Updated : Jul 13, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details