కొండల నుండి వచ్చే జలాలను వినియోగించుకోవాలని లక్ష్యంతో కొండలనడుమ 74 మిలియన్ ఘనపు అడుగులు నిల్వసామర్ధ్యంతో,రూ. 9 కోట్ల వ్యయంతో ఏలేరు సుబ్బారెడ్డి సాగర్,చంద్రబాబు ప్రాజెక్టులను నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు కాలువల నిర్మాణానికి రెండేళ్లకింద రూ.5కోట్లు విడుదల చేసిన ఇప్పటికి వీటి నిర్మాణం జరుగలేదు. 9 కి.మీ పొడవుతో ఎడమ కాలువ,2 కి.మీ పొడవుతో కుడి కాలువకి అవసరం అయిన భూమిని రైతాంగం నుండి చేపట్టవలసి ఉంది..
రిజర్వాయర్లకు కాలువల్లేవ్...పొలాలకు నీళ్లు లేవ్..! - dosent have canals
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేరు సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్లున్న వాటికి కాలువలే లేక రైతులకు నిరుపయోగంగా ఉన్నాయి. నీరు పుష్కలంగా ఉన్న వాడుకోలేని దుస్థితి ఏర్పడింది.
reserviors dosent have canals prattipadu,eastgodavari district
కాలువలు పూర్తయితే ..వొమ్మంగి,శరభవరం,పెద్దిపాలెం,పొదురుపాక,తులూరు,పాండవుల పాలెం,గజ్జనాపూడి,కొత్తూరు,కొత్తపల్లి గ్రామాలకు నీరు అందుతుంది.. ఈ గ్రామాలు సాగర్ ఆయకట్టు లో ఉండటంతో వీటిని పుష్కర ఆయకట్టులో చేర్చలేదు.. అక్కడక్కడ ఇంజిన్లు ద్వారా కాలువలు గెడ్డలలో నీటిని తోడుకొంటూ వ్యవసాయం కొనసాగిస్తున్నారు..నీటి సౌకర్యాలు లేక అధికశాతం రైతులు తోటల పెంపకం పై ఆసక్తి చూపుతున్నారు..ప్రభుత్వం ఇప్పటికైనా కాలువలు నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు....