తెలుగు రాష్ట్రాలో పెను విషాదం నింపిన గోదావరి బోటు ప్రమాదం వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ బృందం సభ్యులు రెండోరోజు చేపట్టిన పనులు ఫలితాలు ఇవ్వలేకపోయాయి. రెండోరోజు గంగమ్మకు పూజలు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. నదిలోకి రోప్ వేసిన కొద్దిసేపటికే.. బండరాయికి పట్టి దాదాపు 600 మీటర్ల రోప్‌తో పాటు లంగరు నదిలో పడిపోయాయి. అనంతరం మరో రోప్, లంగరును నీటిలోకి దింపి సహాయకచర్యలు చేపట్టారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. బాలాజీ మెరైన్ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో 25 మంది బృందంతో పాటు కొంతమంది స్థానికులు, పోలీసులు ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు. ఇవాళ కూడా బోటు వెలికితీసే ప్రయత్నాలు కొనసాగనున్నాయి.
గోదావరిలో జల్లెడ పట్టినా.. దొరకని బోటు జాడ! - latest news about boat
గత నెలలో గోదావరిలో మునిగిన రాయల వశిష్ట బోటు జాడ ఇంకా తెలియలేదు. బోటు వెలికితీతలో భాగంగా బాలాజీ మెరైన్ బృందం రెండో రోజు గోదావరిలో జల్లెడ పట్టినా ఫలితం దక్కలేదు.
గోదావరిలో జల్లెడ పట్టినా.. దొరకని బోటు జాడ