ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విలేకరి హత్య... వైకాపా ఎమ్మెల్యేపై కేసు

తుని పట్టణంలో జరిగిన విలేకరి హత్య కేసులో వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై విలేకరి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మరో ఐదుగురిపైనా కేసు నమోదైంది.

విలేకరి హత్య... వైకాపా ఎమ్మెల్యేపై ఫిర్యాదు

By

Published : Oct 17, 2019, 5:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో మంగళవారం రాత్రి పాత్రికేయుడు దారుణహత్యకు గురయ్యారు. మండలంలోని ఎస్‌.అన్నవరం గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు గట్టుపై కాటా సత్యనారాయణ (45) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతుడు తొండంగి మండలంలో ఓ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

తుని మండలం ఎస్‌.అన్నవరం గ్రామంలో ఆయన ఇంటి సమీపంలోనే ఈ దారుణం జరిగింది. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో సత్యనారాయణ తన ఇంటికి వెళ్తుండగా... చెట్ల మాటున, చీకట్లో నక్కిన దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగారు. తల వెనుక, మెడ వద్ద విచక్షణారహితంగా పొడిచారు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనిని సీరియస్​గా తీసుకున్న పోలీసులు తాజాగా వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కేసు నమోదు చేశారు.

విలేకరి హత్య... వైకాపా ఎమ్మెల్యేపై ఫిర్యాదు

ఇదీ చదవండీ... 2020 నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం వద్దు!

ABOUT THE AUTHOR

...view details