తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో.. రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 9న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. లెక్కింపు సమయంలో కొందరు వ్యక్తులు గదిలోకి ప్రవేశించి బ్యాలెట్ పత్రాలను అపహరించుకుపోయారు. దీంతో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో.. నేడు ఆ పంచాయతీకి రీపోలింగ్ నిర్వహించారు. భారీ బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.