ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపల్లిలో చేనేత హస్తకళల తపాలా కవర్ విడుదల - తూగో జిల్లా కొత్తపల్లిలో చేనేత హస్తకళల తపాలా కవర్ విడుదల

ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఉప్పాడ చేనేత హస్తకళతో కేంద్ర ప్రభుత్వం ముద్రించిన తపాలా కవరను తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే దొరబాబు పాల్గొన్నారు.

Release of handloom handicrafts postage cover in kottapalli at east godavari
కొత్తపల్లిలో చేనేత హస్తకళల తపాలా కవర్ విడుదల చేస్తున్న ఎంపీ వంగా గీత , మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే దొరబాబు

By

Published : Jan 3, 2020, 9:31 PM IST

కొత్తపల్లిలో చేనేత హస్తకళల తపాలా కవర్ విడుదల

ఉప్పాడ చేనేత హస్తకళతో కేంద్ర ప్రభుత్వం ముద్రించిన తపాలా కవరును తపాలా శాఖ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే దొరబాబు హజరయ్యారు. ఉప్పాడ పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచడానికి ఎంతో కృషి చేసిన శ్రీ వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్ అధినేత దివంగత లొల్ల వెంకట్రావు చిత్రం, పట్టు జరీ పోగులతో తపాల కవర్ తయారు చేశారు. చేనేత హస్తకళలు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కన్నబాబు అన్నారు. ఉప్పాడలో చేనేత మార్కెటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ చీరల వల్ల మన ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా తపాలా కవర్ ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని ఎంపీ గీత అభినందనలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details