తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం ధనలక్ష్మి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చి నిర్మాణ కట్టడాలు ఆపాలంటూ ఆ కాలనీకి చెందిన ప్రజలు రిలే దీక్ష చేపట్టారు. కనీస నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని అధికారులు నిలిపివేయాలన్నారు. ఐదు నెలలుగా ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రిలే దీక్షలు చేపట్టారు. వారి దీక్షలకు భాజపా గుంటూరు జిల్లా ఇన్ఛార్జీ తమలంపూడి రామకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. కాలనీవాసుల ఫిర్యాదును అధికారులకు పట్టించుకోవడంలేదన్నారు. నిర్మాణం ఆపకపోతే దీక్ష మరింత ఉద్ధృతం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు.
'అనుమతి లేని నిర్మాణాలను ఆపాలంటూ రిలే దీక్షలు' - relay initiates to stop religious constructions without permission
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం ధనలక్ష్మి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చి నిర్మాణ కట్టడాలు ఆపాలంటూ ఆ కాలనీ వాసులు రిలే దీక్ష చేపట్టారు.
అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మత నిర్మాణాలను ఆపాలంటూ రిలే దీక్షలు