కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. వివిధ రంగాలపై దీని ప్రభావం పడుతోంది. ఈ నెల 20 నుంచి ఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని అధికారులు అంటున్నారు. ప్రయాణికులు తగ్గిపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు వెలవెలబోతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో అమలాపురం, రాజోలు, రావులపాలెం ఇలా మూడు డిపోలు ఉన్నాయి. రైలు మార్గం లేని కోనసీమకు ఏకైక మార్గం రోడ్డు రవాణా. ఈ కారణంగా ఇక్కడ ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పడిపోయింది.