సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, గుండాటలు జోరుగా సాగాయి. వీటితో పాటు రికార్డింగ్ డాన్స్ ప్రదర్శనలు సైతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని ఆత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం మండలాల్లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయాల్లో అమ్మవారి జాతర మహోత్సవాల్లో, కోడి పందేల బరిల వద్ద నిర్వాహకులు ఈ ప్రదర్శనలు నిర్వహించారు.
పొద్దంతా కోడి పందేలు.. రాత్రంతా రికార్డింగ్ డాన్స్‌లు - తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్స్‌లు జోరుగా సాగాయి. అమ్మవార్ల జాతర మహోత్సవాల్లో కొందరు నిర్వాహకులు అర్ధరాత్రుల్లో వీటిని నిర్వహించారు.
రాత్రంతా రికార్డింగ్ డాన్స్‌లకు చిందులు