.
రావులపాలెం మార్కెట్లోకి రెడీమేడ్ పిడకలు... - updates of sankranthi celberatin in east godavari
పూర్వం నెలరోజుల ముందు నుంచే భోగిమంటల్లో పిడకలు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ల్లో రెడీమేడ్‌గా దొరికెస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని పలు దుకాణాల్లో భోగి పిడకలు విక్రయిస్తున్నారు. ప్రజలకు అందుబాటు ధరలో 45 నుంచి 50 రూపాయిలకు వీటిని అమ్ముతున్నారు. చిన్నపిల్లలు భోగిమంటల్లో పిడకలు వేయటం ఆచారం కావడం వల్ల ప్రజలంతా వీటిపై మొగ్గు చూపుతున్నారు.
దుకాణాల్లో అమ్ముతున్న రెడీమేడ్ పిడకలు