తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు నిరసనకు దిగారు. రేషన్ సరకుల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన చేపట్టారు. వినియోగదారులకు సకాలంలో రేషన్ సరకులు ఇచ్చేందుకు ఈపీవోఎస్ మిషన్లు పని చేయటంలేదని... సర్వర్‌తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. తమకు రావాల్సిన కమిషన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవటం దారణమన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ల నిరసన
ఈపీవోఎస్ మిషన్లతో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్ సరకుల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిరనస చేపట్టారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ల నిరసన