ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండుసార్లు వేలిముద్ర వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: డీలర్లు - కొత్తపేట నియోజకవర్గంలోని రేషన్ డీలర్లు నిరసన

రేషన్ దుకాణాల వద్ద ప్రజలు రెండుసార్లు వేలిముద్ర వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొత్తపేట నియోజకవర్గంలోని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ పాస్ యంత్రాలతో నిరసన వ్యక్తం చేశారు.

ration dealers protest at mro office in east godavari
రెండుసార్లు వేలిముద్ర వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: డీలర్లు

By

Published : Oct 24, 2020, 5:38 PM IST

నూతనంగా రేషన్ దుకాణాల వద్ద ప్రజలు రెండుసార్లు వేలిముద్ర వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రేషన్ డీలర్లు నిరసన తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద రేషన్ డీలర్లు ఈ-పాస్ యంత్రాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ-పాస్ యంత్రాలతో నిరసన వ్యక్తం చేస్తున్న డీలర్లు

జిల్లాలో కరోనా వైరస్ కారణంగా పదుల సంఖ్యలో రేషన్ డీలర్లు మృతిచెందినా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. 13 విడతల రేషన్ సరఫరాకు సంబంధించి తమకు రావాల్సిన కమీషన్ నేటికి విడుదల చేయలేదని పేర్కొన్నారు. కమీషన్​ను వెంటనే విడుదల చేయాలని, రెండుసార్లు వేలిముద్ర వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details