ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొరాయిస్తున్న సర్వర్... లబ్దిదారుల ప'రేషాన్' - ration problems in east godavari

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉన్నందున ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్ని చోట్ల సరకుల సరఫరాలో సర్వర్ మొరాయిస్తుండటంతో లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ సమస్య అధికంగా ఉంది.

Ration Beneficiaries  problems in East Godavari District
తూర్పుగోదావరి జిల్లాలో రేషన్ లబ్దిదారుల అవస్థలు

By

Published : Mar 31, 2020, 4:47 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రేషన్ లబ్దిదారుల అవస్థలు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు ఉపయోగించే సర్వర్ పని చేయడం లేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పంపిణీ చేస్తున్నందున లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో సాంకేతిక సమస్యతో జాప్యం జరుగుతోంది. ఎండలో నిలబడలేక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువు గ్రామంలో యువత, గ్రామ వాలంటీర్స్ సంయుక్తంగా రేషన్ షాపుల వద్ద టెంట్లు వేసి ఎండ నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details