ఆలయాల్లో రథోత్సవాలు... మొక్కులు తీర్చుకున్న భక్తులు పలు జిల్లాల్లోని ఆలయాల్లో స్వామి వార్లకు రథోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకొని.. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయం రూ,18,13,115 వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
కడప జిల్లా
కడప జిల్లా బద్వేలు మండలం అనంత రాజపురం గ్రామంలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీవారు దేవేరులతో పురవీధుల్లో రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
నెల్లూరు జిల్లా
నెల్లూరులో శ్రీ తల్పగిరి రంగనాథస్వామి రథోత్సవం కన్నుల పండగగా జరిగింది. భూదేవి, శ్రీదేవి సమేతంగా స్వామి వారు దర్శన మిచ్చారు. చిత్రకూటం నుంచి ప్రారంభమైన రథోత్సవం, రంగనాయకులపేట పురవీధుల్లో విహరించి, నాలుగుకాళ్ల మండపం వరకు సాగింది. భారీ సంఖ్యలో భక్తులు హజరై... మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తోపాటు పలువురు నాయకులు రథోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి