అరుదైన పుష్పం.. కనువిందు - కొత్తకోటలో బ్రహ్మకమలం
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ వ్యక్తి ఇంటి పెరట్లోని బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఆకులే పువ్వులుగా మారడం దీని ప్రత్యేకత. హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ అరుదైన పువ్వు ఏడాదికి ఒక్క సారి మాత్రమే వికసిస్తుంది. శివునికి ఎంతో ప్రీతికరమైనదని భక్తుల విశ్వాసం.
వికసించిన బ్రహ్మకమలం
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెద్దింటి రామం అనే వ్యక్తి ఇంటి పెరట్లో బ్రహ్మ కమలం వికసించి కనువిందు చేసింది. దీంతో పుష్పం వద్ద మహిళలు పూజలు నిర్వహించారు. ఏడాదికి ఒకసారి వికసించే బ్రహ్మ కమలం, కొద్దిసేపటికే మళ్ళీ ముడుచుకుపోతుంది. శివునికి ఎంతో ఇష్టమైన బ్రహ్మ కమలం తమ ఇంట పూయడం ఆనందంగా ఉందని రామం కుటుంబీకులు తెలిపారు.