తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ చేపల రేవులో ఓ మత్స్యకారుడికి పెద్ద పీత చిక్కింది. సాధారణంగా పీత 100 నుంచి 250 గ్రాముల వరకు ఉంటుంది. అలాంటిది ఈ పీత కిలో పైబడి బరువు ఉంది. దీన్ని కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఈ భారీ పీత వేలం నిర్వహించగా ఓ వ్యాపారి 1000 రూపాయలకు సొంతం చేసుకున్నాడు. దీన్ని మండ పీతగా పిలుస్తారని.. చాలా అరుదుగా లభిస్తాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
ఉప్పాడలో చిక్కిన ఆ పీత ఖరీదు రూ. 1000 - rare crab in uppada
సాధారణంగా పీత 100 నుంచి 250 గ్రాముల వరకు ఉంటుంది. అలాంటిది ఏకంగా కిలోకి పైగా బరువున్న పీతను ఎప్పుడన్నా చూశారా.. చూడాలంటే తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు వెళ్లాల్సిందే మరీ...
ఉప్పాడలో అరుదైన పీత