పెద్దాపురం ఏడీబీ రహదారిపై ప్రమాదం.. నలుగురు మృతి - road accident at peddapuram latest news
06:15 May 13
ఘోర ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ రహదారిపై గురువారు తెల్లవారుజామున ఘోరప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొని 5 నెలల చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. ఏడీబీ రహదారి పారిశ్రామిక ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. కారులో చిక్కుకున్న మరో ఐదుగురిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
గృహప్రవేశ వేడుకలో పాల్గొనేందుకు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి తొమ్మిది మంది కుటుంబసభ్యులు ఓ కారులో బయలుదేరారు. పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్దకు చేరుకునేసరికి డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉంది. సమాచారం అందుకున్న పెద్దాపురం సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కుటుంబాల్లో కరోనా కల్లోలం..ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురేసి మృత్యువాత