కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల
రాష్ట్రంలో పేరొందిన రంగరాయ వైద్య కళాశాల బోధనాసుపత్రి దిశగా అడుగులు వేస్తోంది. నాడు-నేడు పథకంలో భాగంగా అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయగా.. భూమి పూజ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోధనాసుపత్రిగా ఉన్నప్పటికీ ఆసుపత్రి ఒక చోట, భోదనా కళాశాల వేరొక చోట ఉండటంతో రోగులకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు విభాగాలనూ ఒకే చోటుకు చేర్చి కార్పొరేట్ స్థాయిలో నిర్మాణాలు చేపట్టి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని అభివృద్ధికి నాడు-నేడు పథకం ద్వారా రూ.900 కోట్లు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ప్లానింగ్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లఖ్‌నవుకి చెందిన స్కై లైన్ సంస్థకు అందించగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సొసైటీ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐటీఐ స్థలంలో ఆసుపత్రి..
బోధన, ఆసుపత్రి ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జీజీహెచ్‌లో అందిస్తున్న సేవలను రంగరాయ సమీపంలో ఉన్న ఐటీఐ కళాశాలకు మార్పు చేయనున్నారు. రంగరాయ వైద్య కళాశాల పక్కనే ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలాన్ని ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు. అక్కడ జీప్లస్ 8, జీప్లస్ 6 పద్ధతిలో భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. అత్యవసర విభాగం, ఓపీ సేవలు, అడ్మినిస్ట్రేషన్ విభాగం, డయాగ్నోస్టిక్ కేంద్రం, మెడికల్ బ్లాక్, సర్జికల్ బ్లాక్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మించనున్నారు. ఇక్కడ 25 విభాగాలకు సంబంధించిన రోగులకు సేవలందించనున్నారు.
ఆధునిక వసతులతో..
రంగరాయ వైద్య కళాశాల 34 ఎకరాల్లో 780 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో వసతిగృహం, బీఎస్సీ నర్సింగ్ కళాశాల, పీజీ విద్యార్థులకు 250 గదులు, సీనియర్ పీజీ విద్యార్థులకు 30 గదులు, హౌస్ సర్జన్‌కు 150, అకడమిక్, పెరా క్లినికల్, మైక్రోబయోలజీ, బయో కెమిస్ట్రీ, పెథాలజీ విభాగాలు, నాన్ టీచింగ్, టీచింగ్, గెస్ట్ హౌస్ తదితర భవనాల నిర్మాణానికి ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. 7.5 ఎకరాల్లో 210 వైద్య విద్యార్థులకు వసతి గృహాలు, పీజీ విద్యార్థులకు 250 గదులు, సీనియర్ పీజీ విద్యార్థులకు 30 గదులు, హౌస్ సర్జన్లకు 100, వసతిగృహాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఏ విభాగం ఎక్కడ..
ప్రస్తుతం కాకినాడ సామాన్య ఆసుపత్రి 20 ఎకరాల్లో సర్జరీ, ఆర్థోపెడిక్, మెడిసిన్, పిడియాట్రిక్, టీబీసీడి, గైనిక్, అనస్తీషియా, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, రేడియోథెరపీ, సైక్యాట్రిక్, ఎస్‌పీఎం, పెథాలజీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, యురాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, ఫిడియాట్రిక్ సర్జరీ, సీటీ సర్జరీ, డెంటల్, ఫారన్‌సిక్ మెడిసిన్, ఓపీ బ్లాక్ ద్వారా రోజూ సుమారు 2,500 మందికి సేవలందిస్తున్నారు.
బోధన, సేవలు ఒకే చోట..
కాకినాడ సామన్య ఆసుపత్రి రంగరాయ వైద్య కళాశాలకు బోధనాసుపత్రిగా ఉంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల మెరుగైన సేవలు అందించలేక పోతున్నాం. వైద్య రంగంలో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాల, ఆసుపత్రి ఒకే చోట ఉండాలని నిర్ణయం తీసుకుంది. బోధనాసుపత్రిగా రూ.900 కోట్లతో అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో 1,150 పడకలు ఉండగా.. ఆ సంఖ్యను 2,500 వరకు పెంచనున్నాం.-కె.బాబ్జి, ప్రిన్సిపల్, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ
ఇదీ చదవండి