మన్యం ప్రజల సమస్యలపై.. ఎమ్మెల్యే కంటతడి - emotional
ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే ఆవేదనకు గురయ్యారు. వారి బాధలను మంత్రికి వివరించే క్రమంలో కన్నీటిపర్యంతమయ్యారు.
మన్యంలో సరైన వైద్యం అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గిరిజన ప్రజలు విష జ్వరాల బారినపడి తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించి మన్యం ప్రజలను ఆదుకోవాలని కోరారు.