తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అట్రాసిటీ కేసుల సరళిపై.. ఏడు మండలాల తహసీల్దార్లు, పోలీసు సిబ్బందితో ఆర్డీవో సీనా నాయక్ సమీక్ష నిర్వహించారు.
'అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి' - రంపచోడవరంలో పెండింగ్ అట్రాసిటీ కేసులు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఆర్డీవో సీనా నాయక్.. అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలోని ఏడు మండలాల తహసీల్దార్లు, పోలీసు సిబ్బందితో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆర్డీవో
అట్రాసిటీ కేసులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. చట్ట ప్రకారం వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని ఆర్డీవో సీనా నాయక్ ఆదేశించారు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 16 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:మంత్రులు సహకరించడం లేదు.. వైకాపా ఎమ్మెల్యే విమర్శలు