కరోనా టీకాపై అపోహలు విడనాడాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. శుక్రవారం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని సందర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ , వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్లను చేయిస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
'కరోనా టీకాపై అపోహలు వద్దు' - తూర్పు గోదావరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
కరోనా టీకాపై అపోహలు వీడాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. శుక్రవారం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
rampachodavaram itda po on covid vaccine