TDP leader Ramakrishna Reddy Fire on Anaparthi YSRCP MLA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పార్టీ అండదండలతో అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. కొండలు, గుట్టలను తవ్వేస్తూ.. వ్యాపారాలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ప్రతిపక్షాలను, స్థానికులపై తప్పుడు కేసులు పెట్టించి, బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ వ్యాపారాలపై న్యాయస్థానాలు రుసుములు విధిస్తున్నా..వాటిని లెక్కచేయకుండా దందాలు కొనసాగిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్‌పై తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు.
చుక్కమ్మ చుక్క రాయుడు కొండను తవ్వేస్తున్నారు.. అనపర్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకునిఅక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరులో ఉన్న చుక్కమ్మ చుక్క రాయుడు కొండను ఇద్దరు వ్యక్తుల పేర్లతో తవ్వించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) మైనింగ్ అధికారులకు రూ.9 కోట్ల అపరాధ రుసుమును విధిస్తే.. దానిని మాఫీ చేసుకునేందుకు రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లారన్నారని దుయ్యబట్టారు. మంత్రి పెద్దిరెడ్డి అపరాధ రుసుమును మాఫీ చేయిస్తే.. ఆయనపై న్యాయస్థానంలో పోరాడుతానని హెచ్చరించారు.
Illegal mining: ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు.. ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి
మంత్రి పెద్దిరెడ్డిపై పోరాటం చేస్తాం..మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..''తూర్పు గోదావరి జిల్లా రంగపేట మండలం దొంతమూరు గ్రామంలో ఉన్న చుక్కమ్మ చుక్కారాయుడు కొండను అనపర్తి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్య సత్యనారాయణ రెడ్డి ఉయ్యూరు వీర్రాజు, నల్లమర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని.. గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున కొండను తవ్వుతున్నారు. దీనిపై నేను హైకోర్టును ఆశ్రయించాను. దాంతో హైకోర్టు ఈ వ్యవహారం దర్యాప్తు చేయించింది. ఇటీవలే హైకోర్టు మైనింగ్ అధికారులకు రూ.9 కోట్ల అపరాధ రుసుమును విధించింది. దీంతో కోర్టు విధించిన అపరాధ రుసుములను ప్రభుత్వ సహకారంతో మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాఫీ చేసుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి వద్దకు వెళ్లారు. ఒకవేళా మంత్రి పెద్దిరెడ్డి అపరాధ రుసుమును మాఫీ చేయిస్తే గనుక నేను ఆయనపై కూడా న్యాయస్థానంలో పోరాడుతాను.'' అని ఆయన అన్నారు.
kondapalli mining: 'కొండపల్లి మైనింగ్‌పై పూర్తి నివేదిక ఇవ్వండి'
దొంతమూరులోని చుక్కమ్మ చుక్క రాయుడు కొండను తెల్లరేషన్ కార్డుదారులైన ఉయ్యూరు వీర్రాజు, నల్లమర్ల శ్రీనివాసరావు బినామీ పేర్లతో తవ్వేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్‌పై నేను హైకోర్టుకు వెళ్లానని.. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని చెప్పారు. అవును నిజమే నేను కోర్టుకు వెళ్లాను. అక్రమ మైనింగ్‌పై న్యాయస్థానం అధికారులకు రూ.9 కోట్ల రూపాయల అపరాధ రుసుము విధించింది. దీనిని చెల్లించకుండా ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి ఏడాదిన్నరగా మంత్రి పెద్దిరెడ్డి వద్దకు వెళ్లి మాఫీ చేయించాలని వేడుకుంటున్నారు.-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే
మా గ్రామంలో అక్రమ మైనింగ్‌ను ఆపండి: బొబ్బేపల్లి గ్రామస్థుల వినతి
అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారు: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి