మనిషి రూపంలో ఉండి తమకు పునర్జన్మ ఇచ్చే వైద్యుడు ప్రత్యక్ష దైవమని మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కనకాల వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణ ప్రాంతీయ ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులు, శానిటరీ సిబ్బంది తదితరులుపై పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు.
రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ శానిటరీ, పోలీసు సిబ్బందిని, సీఐ శ్రీనివాస్ తదితరులను శాలువాతో సత్కరించి పూలవర్షం కురిపించారు. పండ్లను బహుమానంగా అందజేశారు.