తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని తన వాహనంలో ఆసుపత్రికి చేర్చారు. ఆలమూరు మండలం చింతలూరుకు చెందిన భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై మండపేటకు వెళ్లి వస్తుండగా.. గుమ్మివేరు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య తలకు బలమైన గాయం తగిలింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రామచంద్రాపురం డీఎస్పీ క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చిన డీఎస్పీ - తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రోడ్డు ప్రమాదం
కరోనా నేపథ్యంలో రోడ్లపై ఎవరూ లేని వేళ సహాయం అవసరమైన వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. అత్యవసర పనుల కోస బయటకు వచ్చి సాయం కోసం చూస్తున్న వారిని పోలీసులు ఆదుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వారిని తన వాహనంలో ఆసుపత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నాడో పోలీసు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చిన డీఎస్పీ