ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూ.గో జిల్లా వ్యాప్తంగా నిరసనల వెల్లువ - RALLY_AGAINST_MODI_EAST_GODAVARI_DISTRICT

చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు చేపట్టారు.

రాష్ట్రంపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

By

Published : Feb 11, 2019, 9:06 PM IST

రాష్ట్రంపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
కేంద్ర వైఖరికి నిరసనగా దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా... తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ ఆధ్వర్యంలో కాకినాడలోని భానుగుడి సెంటర్లో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ చేశారు. శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. కత్తిపూడి జాతీయ రహదారిపై తెదేపా కార్యకర్తలు బైఠాయించారు.

ABOUT THE AUTHOR

...view details