తూర్పుగోదావరి జిల్లా తునిలో 15 ఏళ్ల క్రితం రాజీవ్ గృహకల్ప పథకంలో భాగంగా నిర్మించిన నివాసాలు ప్రస్తుతం అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. గోడలు బీటలు వారి ప్రమాదకరంగా ఉండగా... పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. మౌలిక వసతులైతే ఇక సరేసరి. ఏ క్షణం ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... ఇళ్లకు మరమ్మతులు చేపట్టి.. తగిన వసతులు కల్పించాలంటూ కోరుతున్నారు.
తునిలో శిథిలావస్థకు చేరిన రాజీవ్ గృహకల్ప భవనాలు
రాజీవ్ గృహకల్ప పథకంలో భాగంగా పేదలకు నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉన్న భవనాల పరిస్థితులపై కథనం.
శిథిలావస్థలో రాజీవ్ గృహ కల్ప భవనాలు
Last Updated : Dec 26, 2019, 5:35 PM IST
TAGGED:
tuni latest news