జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాజానగరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రి హయాంలో ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో జిల్లాస్థాయి ఆసుపత్రిలో 250 పడకలను.. 500కు పెంచుతామని, మెడికల్ కాలేజీ నిర్వహిస్తామని తెలిపారు. నగర ప్రజల చిరకాల కోరికైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని, రాజమహేంద్రవరంలో జూపార్క్ పెడతామని అన్నారు. కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
'రాజన్న రాజ్యంలో రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తాం' - జక్కంపూడి రాజా
జగన్మోహన్రెడ్డి హయాంలో రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. నగర ప్రజల చిరకాల కోరికైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తామని, జూపార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాజానగరం ఎమ్మెల్యే రాజా