ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాసంకల్ప యాత్రను స్మరించుకున్న రాజానగరం ఎమ్మెల్యే - prajallo naadu.. prajala kosam nedu news today

"ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు" అనే నినాదంతో సీఎం వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తైనందున రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని కీర్తించారు.

ప్రజాసంకల్ప యాత్రను స్మరించుకున్న రాజానగరం ఎమ్మెల్యే
ప్రజాసంకల్ప యాత్రను స్మరించుకున్న రాజానగరం ఎమ్మెల్యే

By

Published : Nov 14, 2020, 5:59 AM IST

"ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు" అనే నినాదంతో జన నేత పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తైందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తు చేసుకున్నారు. సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.

హామీలు నెరవేర్చిన ఘనత ఆయనదే..

ప్రజా సంకల్ప యాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను దగ్గర్నుంచి చూసి ప్రజా మేనిఫెస్టో రూపొందించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను 17 నెలల్లోనే 90 శాతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్​కే దక్కుతుందన్నారు.

ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details