sugar factory funds scam: పన్నెండేళ్ల క్రితం వెలుగు చూసిన చక్కెర కర్మాగారం బ్యాంకు రుణాల కుంభకోణంపై ఎట్టకేలకు ఇప్పటికి స్పష్టత వస్తోంది. సంక్షోభంలో ఉన్న పరిశ్రమను గట్టెక్కించాలన్న కారణం చూపించి రైతుల పేర్లతో బ్యాంకుల నుంచి రూ.300 కోట్లను దారి మళ్లించిన వ్యవహారం అప్పట్లో వివాదాస్పదమైంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రైతులకు తెలియకుండానే ఫ్యాక్టరీ యాజమాన్యం, బ్యాంకు అధికారులతో కుమ్మక్కై పాల్పడిన ఈ కుంభకోణంలో చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీఐడీ అధికారులు కొద్ది రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు.
jaipur sugars scam: పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులోని జైపూర్ షుగర్స్ ఆధ్వర్యంలో వీవీఎస్ షుగర్స్ పేరుతో ఓ సంస్థ నడిచేది. ఆ సంస్థ ప్రతినిధులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొందరు అధికారులతో కలిసి అప్పట్లో రైతుల పేరున బ్యాంకు నుంచి సదరు సంస్థ నిర్వహణకు అవసరమైన ధనాన్ని దొడ్డిదారిన తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పలువురు చెరకు రైతుల పేరుతో ఆయా ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి రుణంగా రూ.300 కోట్లు వీవీఎస్ షుగర్స్ ఖాతాలోకి మళ్లించినట్లు అభియోగం.
కుంభకోణంలో 66 మంది...