ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవిష్య నిధి ఖాతాదారులకు ప్రత్యేక అడ్వాన్సులు - east godavari latest covid news

పీఎఫ్​ ఖాతాదారులకు ప్రత్యేక అడ్వాన్సులు మంజూరు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కమిషనర్​-1 కేశవరావు తెలిపారు. క్లెయిమ్​లను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని చెప్పారు.

advance pf amount paid to pensioners
ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-1 కేశవరావు

By

Published : Apr 27, 2020, 4:44 PM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను అమలు చేస్తుండటంతో పీఎఫ్‌ ఖాతాదారులకు ప్రత్యేక అడ్వాన్సులు మంజూరు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కమిషనర్‌-1 వి.ఎస్‌.ఎస్‌.కేశవరావు తెలిపారు. ప్రస్తుత నెలలో ఇప్పటివరకు పీఎఫ్‌ ఖాతాదారులు 3,800 మందికి ప్రత్యేక అడ్వాన్సులు ఇచ్చామన్నారు.

తమ సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉంటూ చాలావరకు క్లెయిమ్‌లను ఏరోజుకారోజే పరిష్కరిస్తున్నారని వివరించారు. మిగిలినవి ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో కార్మికులకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details