ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో నాలుగు రోజుల్లో.. పేపర్ మిల్లులో ఆక్సిజన్ ఉత్పత్తి..!

తూర్పు గోదావరి జిల్లాలో ఆక్సిజన కొరత లేకుండా రాజమహేంద్రవరం ఎంపీ భరత్ చర్యలు చేపట్టారు. పేపర్ మిల్లులో ఆక్సిజన్ ఉత్పత్తిపై యాజమాన్యంతో చర్చలు జరిపారు. మరో నాలుగు రోజుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.

oxygen production at rajamahendra varam paper mill
oxygen production at rajamahendra varam paper mill

By

Published : May 6, 2021, 4:49 PM IST

కొవిడ్ బాధితులకు ఊపిరి పోసే ఆక్సిజన్ ప్లాంట్​ను ప్రారంభించేందుకు రాజమహేంద్రవరం ఎంపీ భరత్ చర్యలు చేపట్టారు. పేపర్ మిల్లులో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఉన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ.. యాజమాన్యంతో చర్చించారు. తక్షణం ప్లాంట్ ప్రారంభించాలని చెప్పారు.

సాంకేతిక సమస్యల కారణంగా.. నిపుణులను దిల్లీ నుంచి పిలిపిస్తున్నామని యామాన్యం తెలిపింది. మరమ్మతులు చేసి 4 రోజుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభిస్తామని నిర్వాహకులు చెప్పారని ఎంపీ తెలిపారు. ఉత్పత్తి ప్రారంభిస్తే.. రోజుకు టన్ను ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details