తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో రాజా వాషరమెన్ సొసైటీ ఆధ్వర్యంలో రజకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చాకిరేవు రజక సంఘం అధ్యక్షులు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 70 ఏళ్లుగా చాకిరేవు చెరువులో రజకులు బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారని.. ఇప్పుడు ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ వెంటనే నిలిపివేయాలని రజకులు డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలని రజకుల ఆందోళన - Rajakulus protest to stop distribution of houses
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో రజకులు ఆందోళనకు దిగారు. తాము బట్టలు ఉతికే చాకిరేవు స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం అన్యాయమని నిరసన తెలిపారు. స్థలాల పంపిణీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
![ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలని రజకుల ఆందోళన Rajakul's Protest with Stop Distribution of Houses to Ekgodawari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7893790-858-7893790-1593875250108.jpg)
రజకులు ఇండ్ల స్థలముల పంపిణీ నిలిపివేయాలని నిరసన