తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకూ బీడుగా మారిన భూముల్లో వర్షపు నీరు చేరటంతో రైతులు సాగుకు సిద్థమవుతున్నారు. మెట్ట ప్రాంతంలో చాలాచోట్ల నారుమళ్లలో నీరు చేరింది. అన్నదాతలు వరినాట్లు వేయడం ప్రారంభించారు. ఆశించిన స్థాయిలో వానలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులుగా వర్షాలు.. ఆనందంలో రైతన్నలు - agriculture
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విస్తారంగా వర్షాలు