రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగి విద్యుత్ తీగలు తెగిపడగా.. అధికారులు మరమ్మతులు చేపట్టారు.
విశాఖపట్నం జిల్లా
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనకాపల్లి అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోగా..వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఓర్వకల్లు, చాగలమర్రి, పత్తికొండ, ఆత్మకూరు, మద్దికెర, నందికొట్కూరు మండలాల్లో వర్షాలు కురిశాయి. అకాల వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలంలో పిడుగుపాటు ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. బాతువలో ఇద్దరు గొర్రెల కాపర్లు, చెట్టుపొదిలాంలో ఓ మహిళ మృతి చెందింది.
ఇదీ చదవండి