కరోనా కట్టడిలో భాగస్వామ్యమయ్యేందుకు.. ఇప్పటికే రైల్వే శాఖ ముందుకు వచ్చింది. తాజాగా.. కాకినాడ క్యారేజ్ వేగన్ వర్క్ షాపులో ఉన్న కోచ్‌లను కరోనా బాధితుల చికిత్స కోసం ఐసోలేటెడ్ కోచ్ లుగా మారుస్తున్నట్టు తెలిపింది. అందుబాటులో ఉన్న 13 బోగీల్లో.. ఏడింటిని ఇప్పటికే సిద్ధం చేసింది. మిగతావాటినీ పూర్తి వసతులతో సిద్దం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో బోగీలో 8 మంది రోగులకు ఐసోలేషన్ పడకలు.. మందులు, వైద్య సిబ్బందికి క్యాబిన్లు కేటాయిస్తారు. మరో మూడు రోజుల్లో ఈ పని పూర్తి కానుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. వీటిని ఎక్కడ వినియోగించాలన్నది నిర్ణయిస్తారు.
కరోనా కట్టడికి.. రైల్వే సైతం
కరోనా నివారణ చర్యలకు రైల్వే ముందుకు వచ్చింది. కాకినాడ క్యారేజ్ వేగన్ వర్క్ షాప్ లోని రైల్వే కోచ్ లను ఐసొలేషన్ కోచ్ లుగా మార్చి ఇస్తామని తెలిపింది. ఇప్పటికే 7 బోగీలు సిద్ధం చేసినట్టు తెలిపింది.
Railways that are make into isolation wards at kakinada in east godavari