ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Radheshyam: రాధేశ్యామ్​ మూవీ విడుదల.. ప్రభాస్​ అభిమానుల సందడి - యానాం లేటెస్ట్​ అప్​డేట్​

radheshyam movie: రాష్ట్రవ్యాప్తంగా రాధేశ్యామ్​ చిత్ర సందడి నెలకొంది. అభిమానుల కేరింతలతో సినిమా థియేటర్లన్నీ కోలాహలంగా మారాయి. యానాంలో రాధేశ్యామ్ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. అభిమానులతో కలిసి థియేటర్‌లో చిత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్​ వీక్షించారు.

Radheshyam movie fans
యానాంలో రాధేశ్యామ్​ చిత్రం

By

Published : Mar 11, 2022, 12:11 PM IST

radheshyam movie: రాష్ట్రవ్యాప్తంగా రాధేశ్యామ్​ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర ప్రభాస్​ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే థియేటర్ల దగ్గరకు భారీ ఎత్తున చేరుకుని బాణసంచా కాల్చి.. కేకులు కోసి సందడి చేస్తున్నారు.

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. రాధేశ్యామ్ చిత్రాన్ని అభిమానులతో కలిసి ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్​ తిలకించారు. రెబల్ అభిమానులు కేరింతలతో థియేటర్ ప్రాంగణం కోలాహలంగా మారింది. ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా ఉదయం ఐదున్నర గంటలకే ప్రారంభమైన చిత్ర ప్రదర్శనను అభిమానుల కోరిక మేరకు థియేటర్‌లో ఎమ్మెల్యే అశోక్​ వీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details