తూర్పు డెల్టాకు ఏప్రిల్ 15 వరకు, మధ్య డెల్టాకు ఏప్రిల్ 20 వరకు సాగునీటి అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు నివేదిక ఇచ్చామని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు తెలిపారు. సాగునీటి సలహా మండలిలో తీర్మానించిన మేరకు మార్చి 31న కాలువలుకు నీటి విడుదల ఆపేసి.. జూన్ 1న మళ్లీ విడుదల చేయాలి.
అయితే... మధ్యలో రబీ వరి కోతలు నామమాత్రంగా మొదలయ్యాయి. అక్కడక్కడ ఇంకా చేలు ఇప్పుడే ఎదుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో... గింజ గట్టిపడే దశకు నీరు అధికంగా అవసరం ఉంటుంది. కాబట్టి తూర్పు డెల్టాకు ఏప్రిల్ 15 వరకు, మధ్య డెల్టాకు 20 వరకు నీటిని విడుదల చేయాలని కోరినట్లు అధికారులు మంత్రికి వివరించారమని అన్నారు.