ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి.. పదేళ్ల క్రితం విగ్రహాల ఏర్పాటు - తణుకులో క్విట్ ఇండియా ఉద్యమ విగ్రహాల ఏర్పాటు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బ్రిటిష్ కాలంలో జరిగిన క్విట్ఇండియా ఉద్యమ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. నాటి ఉద్యమస్ఫూర్తిని ఎల్లవేళలా ప్రతిబింబించేలా చేసిన విగ్రహాలు ఉద్యమ పోరాటాలను ప్రజలకు గుర్తుండేలా చేస్తున్నాయి.

quit india statues in east godavari distrcit
quit india statues in east godavari distrcit

By

Published : Aug 9, 2021, 10:56 AM IST

Updated : Aug 9, 2021, 4:15 PM IST

బ్రిటిష్ వలస పాలనకు చరమాంకం పలికిన ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. భారత్ చోడో (క్విట్ ఇండియా) అంటూ మహాత్మా గాంధీ చేసిన గర్జన స్వాతంత్య్రం సాధించాలన్న ఆకాంక్షను ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసి, ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అప్పటివరకు భారతదేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించిన బ్రిటిష్ వారి బింకాన్ని చెదరగొట్టిన ఘనత క్విట్ ఇండియా ఉద్యమానిదే.

ఇంతటి మహోన్నత ఘనత కలిగిన ఉద్యమస్ఫూర్తిని తణుకు ప్రజల మదిలో నిలిచిపోయేలా చేయడానికి సుమారు 10 సంవత్సరాల క్రితం అప్పటి శాసన సభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉద్యమ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పట్టణం లోని ఎన్టీఆర్ పార్క్ ముందు భాగంలో ఈ విగ్రహాలు దర్శనమిస్తూ నాటి ఉద్యమస్ఫూర్తిని గుర్తు చేస్తున్నాయి. ఈ విగ్రహాలకు మరో ప్రత్యేకత ఉంది. గుజరాత్లోని పోర్ బందర్, ఢిల్లీలోనూ మాత్రమే ఈ విగ్రహాలు ఉండగా తణుకులో ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం విశేషం.

Last Updated : Aug 9, 2021, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details