ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో భోజనం కోసం బారులు - queue lines for lunch in rajahmundry

కరోనా కారణంగా పేదలు కనీసం కడుపు నింపుకోవడమే కష్టంగా మారింది. ఓవైపు వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుంటే మరోవైపు తినడానికి తిండి దొరకని వారి సంఖ్యా పెరుగుతోంది. కరోనా పేదల ఉపాధికి గండి కొట్టడంతో భోజనం పెట్టే దాతల కోసం రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్ లో ఎంతో మంది పేదలు, ఉపాధి కోల్పోయినవారు, అనాథలు, ఒంటరి వాళ్లు ఆకలితో ఎదురుచూపులు చూస్తున్నారు. లాక్​డౌన్​ ప్రారంభం నుంచి గోదావరి గట్టున ఇవే దృశ్యాలు కనబడుతూనే ఉన్నాయి.

queue lines for lunch in rajahmundry
రాజమహేంద్రవరంలో భోజనం కోసం బారులు

By

Published : Jul 17, 2020, 2:30 PM IST

కరోనా కారణంగా పేదలు కనీసం కడుపు నింపుకోవడమే కష్టంగా మారింది. ఓవైపు వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుంటే మరోవైపు తినడానికి తిండి దొరకని వారి సంఖ్యా పెరుగుతోంది. నిత్యం వివిధ రకాల పనులు చేసుకునే వారికి ఉపాధి కరువై పోవడంతో భోజనం పెట్టే దాతల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్‌ వద్ద గురువారం సాయంత్రం అలాంటి దృశ్యాలే కన్పించాయి. ఓ దాత పంచుతున్న ఆహారం కోసం ఆ ప్రాంతాల్లో ఉంటున్న పేదలు, ఉపాధి కోల్పోయినవారు, అనాధలు, ఒంటరిగా ఉంటున్న వారు భోజనం కోసం ఎగబడ్డారు. క్యూలైన్లలో నిలబడి దాత ఇచ్చిన ఆహారాన్ని అందుకుని కడుపు నింపుకుంటున్నారు. అందని వారు మాత్రం ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి గోదావరి గట్టు వెంబడి నిత్య ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తూనే ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details