తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎస్బీఐ వద్ద ఖాతాదారులకు లావాదేవీల కోసం క్యూ లైన్ పెట్టారు. బ్యాంకు లోపలికి ఐదుగురు వ్యక్తులు మాత్రమే అనుమతిస్తూ వారి పని పూర్తయిన తర్వాత మరొక ఐదుగురిని పంపిస్తున్నారు.
మిగిలిన ఖాతాదారులంతా బ్యాంక్ బయట క్యూ కట్టారు. మనిషికి మనిషికి ఆరు అడుగుల దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా బ్యాంకుల వద్ద మాత్రం ఇవి ఎక్కడా కనిపించడం లేదు.