తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో దేశీవాలి ఆవుకు.. పుంగనూరు ఆవు దూడ జన్మించింది. ఈ దూడ కేవలం 17 అంగుళాల ఎత్తు, 22 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. వడ్డీ రామ్ కుమార్ అనే రైతుకు చెందిన ఆవు దూడను చూసి జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆవుకు పుంగనూరు జాతికి చెందిన వీర్యంతో సంపర్కం చేయడం వల్ల ఈ దూడ జన్మించిందని పశువైద్యాధికారి ప్రసాద్ తెలిపారు.
కడలిలో దేశీవాలి ఆవుకు.. పుంగనూరు ఆవు దూడ జననం - punganur cow calf news
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో దేశీవాలి ఆవుకు 17 అంగుళాల ఎత్తున్న పుంగనూరు ఆవు దూడ జన్మించింది. దీన్ని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పుంగనూరు ఆవు దూడ జననం