ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గౌతమి వంతెన వద్ద జోరుగా పులస చేపల విక్రయాలు - గౌతమి వంతెన వద్ద పులస

గోదావరికి వరద వచ్చిందంటే చాలు పులసల జోరు మొదలవుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు చేరుతోంంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్దనుంచి సముద్రంలోకి నీటిని విడిచి పెట్టడంతో... సముద్రంలో ఉండే పులస చేపలు గోదావరిలో ఎదురు ఈదుతూ వస్తుంటాయి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద జాతీయ రహదారిపై పులస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి,

Pulsa fish sales  at Gautami Bridge
గౌతమి వంతెన వద్ద జోరుగా సాగుతున్న పులస చేపల విక్రయాలు

By

Published : Aug 24, 2020, 8:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి సముద్రంలోకి నీటిని విడిచి పెట్టడంతో... సముద్రంలో ఉండే పులస చేపలు గోదావరిలో ఎదురు ఈదుతూ వస్తుంటాయి. రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద జాతీయ రహదారిపై పులస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి వెళ్లే ప్రయాణికులు ఇక్కడ ఆగి వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే పులస చేప కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడి ప్రాంతవాసులు. వీటిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు వండి మరీ పంపిస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details