తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ రమణయ్యపేట పంచాయతీ జనచైతన్య లేఅవుట్‌లో ఏఆర్సీ స్పోర్ట్స్ అకాడమీని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. విద్యార్ధులు చిన్ననాటి నుంచి చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలని... దీనికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. తన అకాడమీ ద్వారా ప్రతిభ గల పేద క్రీడాకారులను ప్రోత్సహించి ఉచితంగా శిక్షణతో పాటు... వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని గోపీచంద్ చెప్పారు. త్వరలోనే అమరావతిలో అకాడమీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్, గోపీచంద్ సతీమణి లక్ష్మీగోపీచంద్, కాకినాడ సీపోర్టు ఎండీ. ఛైర్మన్ కె.వి.రావు, ఐఐటీ ప్రొఫెసర్. ప్రదీప్‌కుమార్, అకాడమీ నిర్వహకుడు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన పుల్లెల గోపిచంద్ - తూగో జిల్లాలో స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేటలో ఏఆర్సీ స్పోర్ట్స్ అకాడమీని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు.
స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తున్న పుల్లెల గోపిచంద్