తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానంలో.. కరోనా ప్రభావం పెరుగుతోంది. కోవిడ్ ఆసుపత్రిలో పరిస్థితిని పుదుచ్చేరి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు.
ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. యానాం సామాన్య ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పైప్ లైన్ సిస్టమ్ పనితీరును తెలుసుకున్నారు.